Connect with us

International

ఇరాన్ ఎప్పటికీ అణ్వస్త్రాలు కలిగి ఉండకూడదు: G7 దేశాల కీలక తీర్మానం

ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక - వికీపీడియా

ప్రపంచ శాంతి, భద్రతకు సంబంధించి G7 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇటలీలో జరిగిన వార్షిక సమ్మిట్ అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో, ఇరాన్ ఎప్పటికీ అణ్వస్త్రాలు కలిగి ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రాంతీయ అస్థిరత, తీవ్రవాద కార్యకలాపాల వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు G7 నేతలు వెల్లడించారు.

ఇరాన్ అణు కార్యక్రమం మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలకు కారణమవుతోందని పేర్కొంటూ, ఇజ్రాయెల్‌కు తమను తామే రక్షించుకునే హక్కు ఉందని వారు స్పష్టం చేశారు. ఇరాన్ అణు ఒప్పందాన్ని మళ్లీ అమలు చేస్తే, అలాగే సీజ్‌ఫైర్‌కు అంగీకరిస్తే మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తగ్గుతాయని, గాజా వంటి ప్రాంతాల్లో శాంతి నెలకొనే అవకాశం ఉందని జి7 నేతలు అభిప్రాయపడ్డారు. ప్రపంచ స్థాయిలో శాంతి స్థిరత్వాన్ని కాపాడేందుకు ఇది ఒక కీలకమైన అభ్యర్థనగా భావిస్తున్నారు

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending