Connect with us

International

ఇది చరిత్రాత్మక ముందడుగు: కిషన్ రెడ్డి

Kishan Reddy takes charge as Union Minister of Culture & Tourism and DoNER,  ET Government

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. ఈ నిర్ణయాన్ని చరిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించిన ఆయన, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా కులగణన జరగనుండటం ఒక అతిపెద్ద నిర్ణయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రక్రియ దేశంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కీలకమైదని వివరించారు.

ఈ కులగణన ద్వారా సమాజంలోని వివిధ వర్గాల గురించి ఖచ్చితమైన సమాచారం సేకరించబడుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. దీని ఫలితంగా సంక్షేమ కార్యక్రమాలు, పథకాల అమలు, బడ్జెట్ కేటాయింపులు, రాజకీయ రిజర్వేషన్లు మరింత క్రమబద్ధంగా, పారదర్శకంగా జరుగుతాయని ఆయన హామీ ఇచ్చారు. ఈ చరిత్రాత్మక నిర్ణయం దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే దిశగా ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending