movies

ఆనంద్ దేవరకొండ సినిమా ‘తక్షకుడు’ డైరెక్ట్ ఓటీటీలో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తక్షకుడు’ సైలెంట్ గా షూట్ అయ్యి నేరుగా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. వినోద్ అనంతోజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మేకర్స్ తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచింది.

ఆనంద్ గతంలో నటించిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందడానికి కష్టపడుతున్న ఆనంద్‌ 2019లో ‘దొరసాని’తో తెరంగేట్రం చేశాడు. విమర్శకుల నుండి ప్రశంసలు లభించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ పొందలేకపోయాడు.

‘తక్షకుడు’లో ‘లాపతా లేడీస్’ ఫేమ్ నితాన్షి గోయెల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆనంద్ చేతిలో తుపాకీ పట్టుకొని, భయంతో పరుగులు తీస్తున్న ప్రజలను చూపిస్తూ, ఈ సినిమాకు యాక్షన్-థ్రిల్లర్ ఎలిమెంట్ సులభంగా అర్థమయ్యేలా చూపించారు. పోస్టర్ పై “వేటగాడి చరిత్రలో జింక పిల్లలే నేరస్థులు” అనే క్యాప్షన్ కూడా ఉంది.

మేకర్స్ అధికారికంగా వెల్లడించిన ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం త్వరలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్ కోసం రూపొందించబడిందా, డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయబడిందా అనే వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. అయితే, ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ప్రేక్షకుల్లో పెద్ద ఎగ్జైట్‌మెంట్‌ను సృష్టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version