Connect with us

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లోనూ నంది అవార్డులు ఇవ్వాలి: ఆర్.నారాయణమూర్తి

నంది అవార్డుల కమిటీపై ఆర్.నారాయణమూర్తి ఫైర్ - r narayana murthy fire on nandi  awards - Asianet News Telugu

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరిట సినీ అవార్డులు ప్రకటించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు సినీనటుడు ఆర్.నారాయణమూర్తి. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, “తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమను గౌరవిస్తూ గొప్ప అడుగు వేసింది. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ నంది అవార్డులను మళ్లీ ప్రారంభించాలని కోరుతున్నాను. అవార్డులు పరిశ్రమలో ఉన్నత ప్రమాణాలను ప్రోత్సహించేందుకు ఎంతో ఉపయోగపడతాయి” అని అన్నారు.

ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ థియేటర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, టికెట్ ధరలు పెంచితే అవి మూతపడే పరిస్థితి వస్తుందని నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. “ప్రభుత్వాలు ఈ అంశంపై చర్చించి సమతుల్య నిర్ణయానికి రావాలి. ప్రజలకు భారం కాకుండా, థియేటర్లను నిలబెట్టే మార్గాలు వెతకాలి” అని సూచించారు.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending