Latest Updates
అర్చకులకు శుభవార్త: పెన్షన్, బీమా, గ్రాట్యుటీ పెంపు
దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో సేవలందిస్తున్న అర్చకులు, ఉద్యోగులకు శుభవార్త అందింది. అర్చక సంక్షేమ బోర్డు, ఇతర కార్పొరేషన్ ఉద్యోగుల తరహాలో అర్చకులకు పెన్షన్ సౌకర్యం కల్పించేందుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో పదవీ విరమణ చేసిన అర్చకులు, ఉద్యోగులు తమ సీనియారిటీ ఆధారంగా నెలకు ₹10,000 నుంచి ₹20,000 వరకు పెన్షన్ పొందనున్నారు.
అంతేకాదు, ఆస్పత్రి ఖర్చుల కోసం ఇప్పటివరకు ₹2 లక్షల వరకు రీయింబర్స్మెంట్ అందించగా, ఇకపై ఈ మొత్తాన్ని ₹5 లక్షల వరకు బీమా రూపంలో అందించనున్నారు. ఇదే క్రమంలో, గ్రాట్యుటీ మొత్తాన్ని కూడా ₹8 లక్షలకు పెంచేందుకు అర్చక సంక్షేమ బోర్డు ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయాలు అర్చకులు, ఆలయ ఉద్యోగుల ఆర్థిక భద్రతను పటిష్ఠం చేయడంతో పాటు వారి సంక్షేమానికి ఊతమిచ్చే దిశగా ముందడుగుగా నిలుస్తున్నాయి. ఈ చర్యలు ఆలయ సిబ్బంది జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు